ఇంట్లో బుద్ధిమాన్.. బయట శక్తిమాన్!
on Sep 29, 2022

'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'ఊర్వశివో రాక్షసివో'. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి 'విజేత' ఫేమ్ రాకేష్ శశి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.
'ఊర్వశివో రాక్షసివో' టీజర్ అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ ల లిప్ కిస్ తో ప్రారంభమైంది. టీజర్ లో శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ అని అర్ధమవుతుంది. ముఖ్యంగా టీజర్ లోని టీజర్ లోని కొన్ని సీన్స్, డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. "నువ్వు ఇంట్లోనేమో బుద్ధిమాన్.. బయటేమో శక్తిమాన్", "అమ్మనా ఆల్ట్ బాలాజీ.. నువ్వేంట్రా మనీ హేస్ట్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు" వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.
జీఏ2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహనిర్మాతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



