సమంత 'శాకుంతలం' విడుదల వాయిదా
on Sep 29, 2022

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది మూవీ టీమ్.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా 'శాకుంతలం' సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ఈ నెల 23న మేకర్స్ ప్రకటించారు. అయితే వారంలోపే ఆ తేదికి సినిమా రాదని చెబుతూ షాక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 3Dలో విడుదల చేయాలనుకుంటున్నామని, అందువల్ల ఈ చిత్రం విడుదల ఆలస్యం కానుందని తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో 'శాకుంతలం' రూపొందుతోంది. కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనువిందు చేయనున్నారు.
ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



