‘UI’ మూవీతో వస్తున్న ఉపేంద్ర
on Jun 3, 2022

కన్నడ యాక్టర్ ఉపేంద్ర ఒక విలక్షణమైన నటుడు. యాక్టర్ గా డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకుని డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఏ, రా అనే మూవీస్ తో ఒక ట్రెండ్ సృష్టించాడు. 2015 లో ఉపేంద్ర - 2 మూవీ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్ట్ తో ఉపేంద్ర మన ముందుకు రాబోతున్నారు. "UI " అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఐతే జూన్ 3 న పూజ కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రొడ్యూసర్స్ ప్రకటించారు.
ఈ పూజ కార్యక్రమానికి కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, కిచ్చ సుదీప్, విజయ్ హాజరుకానున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా ఉపేంద్ర చూసుకుంటున్నారు. గని అనే మూవీతో ఇటీవల తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన ఉపేంద్ర రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో ఒక మల్టీ లాంగ్వేజ్ మూవీ చేస్తున్నారు. ఉపేంద్ర మూవీస్ అన్నీ కూడా చాలా లోతైన కథ, కథనాలతో ఉంటాయి. వాటి టైటిల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఐఎండిబి వరల్డ్ టాప్ 50 డైరెక్టర్స్ లో ఆయనకు చోటు దక్కిందంటే ఆయన క్రియేటివిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



