ENGLISH | TELUGU  

హ్యాపీ బర్త్ డే రాధ

on Jun 3, 2022

 

1980 s  లో తన అందచందాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది రాధ. చూడచక్కని రూపం, అభినయంతో పాటు డాన్స్ అద్భుతంగా చేసి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. తర్వాత 90 s లో నటనకు  బై బై చెప్పేసి చక్కగా పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ ఐపోయింది. చిరంజీవితో కలిసి ఎన్నో హిట్ మూవీస్ లో యాక్ట్ చేసింది. అప్పటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగుమ్మ ఐనా కూడా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఐతే అప్పటి తారలంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళ పంథాలోనే రాధ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీ అవుతోంది. బిగ్ స్క్రీన్ పైన ఆఫర్స్ లేకపోతే స్మాల్ స్క్రీన్ నుంచి ఆనాటి తారలు చాలామంది పిలుపులందుకుంటున్నారు. తమిళ్ లో ఫేమస్ డాన్స్ షోస్ కి జడ్జిగా ఉన్న రాధ కొంత కాలం బ్రేక్ తీసుకుంది. చిరు, రాధ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ . పదేళ్లు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన రాధకు హ్యాపీ బర్త్ డే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.