'RC15' షూటింగ్ ను అడ్డుకున్న బీజేపీ నేతలు!
on Jul 26, 2022

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమాలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నట్లు సమాచారం.
పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న 'RC15'లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుడిగా, ఎన్నికల అధికారిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలకమైన ఎన్నికల సన్నివేశాలను సరూర్‌నగర్ లోని విక్టోరియా స్కూల్ లో చిత్రీకరిస్తున్నారట. అయితే ఒక వైపు స్టూడెంట్స్ కి క్లాస్ లు జరుగుతుంటే, ఇలాంటి సమయంలో స్కూల్ లో షూటింగ్స్ కి ఎలా అనుమతి ఇచ్చారంటూ ఆ ప్రాంత బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు షూటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమాగా తెరకెక్కుతున్న 'RC15'ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



