బన్నీ, త్రివిక్రమ్ కలిశారు.. దేనికోసమో తెలుసా?
on Jul 26, 2022

'పుష్ప: ది రైజ్'తో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ఎప్పటికీ తనకే సొంతమని చాటుతున్నాడు. ఇటీవల బన్నీ స్టైలిష్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఒక యాడ్ షూట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
.webp)
పుష్ప రాజ్ పాత్ర కోసం కాస్త బొద్దుగా, డీ గ్లామర్ గా తయారైన బన్నీ.. మళ్ళీ తన స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. ఇటీవల బన్నీ తన లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేయగా.. 'ఇండియన్ స్టైల్ ఐకాన్' అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక యాడ్ షూట్ లో బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ యాడ్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈ యాడ్ షూట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అంటే ఎప్పటికీ బన్నీనే అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

కాగా, 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ 'పుష్ప: ది రూల్' షూట్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా బన్నీకి వచ్చిన క్రేజ్ దృష్ట్యా పలు బడా కంపెనీలు ఆయన చేత తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



