కారులో శృంగారం చేశానని చెప్పిన రౌడీ హీరో!
on Jul 26, 2022

'కాఫీ విత్ కరణ్' సీజన్ 7 రాబోయే నాలుగో ఎపిసోడ్‌లో 'లైగర్' మూవీ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య పాండేలను కరణ్ జోహార్ స్వాగతించనున్నాడు. ఎపిసోడ్ సమయంలో, అనన్యను ఆమె, నటుడు ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఏం జరుగుతోందని అడిగాడు కరణ్. ఈ నెల ప్రారంభంలో వారి డేటింగ్ గురించి వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి.
రాబోయే ఎపిసోడ్ నుండి కరణ్ జోహార్ విడుదల చేసిన కొత్త ప్రోమోలో, "నేను నా పార్టీలో చూశాను" అని కరణ్ చెప్పాడు. అనన్య అతనిని అడ్డుకుంటూ, "లేదు, లేదు. మీరేమీ చూడలేదు" అని చెప్పింది. అయినా ఆగకుండా, "నీకు, ఆదిత్య రాయ్ కపూర్‌కి మధ్య ఏం ఉంది" అని కరణ్ రెట్టించాడు. దాంతో అనన్య నోరు మెదపకుండా ఉండిపోయింది.
రాపిడ్ ఫైర్ రౌండ్ సమయంలో, విజయ్‌ని అతను సెక్స్ చేసిన అత్యంత క్రేజీ ప్లేస్ గురించి కరణ్ అడిగాడు. అనన్య "ఈరోజు ఉదయం" అంటూ ఊహించింది. కరణ్ ఆమెను "అది ఈ ఉదయం" అని సరిదిద్దాడు. "కారులో" అని విజయ్ జవాబు చెప్పగా, "అది చాలా అసౌకర్యంగా లేదా" అని కరణ్ అడిగాడు. 'డెస్పరేట్ టైమ్' ఇలాంటి పనులు చేసేలా చేస్తుందని విజయ్ అన్నాడు.
విజయ్, అనన్య తమ 'లైగర్' మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా విజయ్ కనిపించనున్నాడు. అతని తల్లిగా రమ్యకృష్ణ నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ స్పెషల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఆగస్ట్ 25న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



