ఆయన శ్రీహరిని పెళ్లి చేసుకునేవాడట....?
on Sep 3, 2013
రియల్ స్టార్ శ్రీహరి అంటే తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన శ్రీహరి ఏ పాత్రలోనైన కూడా జీవించగలడు. అలాంటి శ్రీహరి నటించిన తాజా తెలుగు చిత్రం "తుఫాన్".
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన ఈ చిత్రంలో షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి నటించాడు. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం గురించి దర్శకుడు అపూర్వ లాఖియ మాట్లాడుతూ... శ్రీహరి ప్రవర్తన, వ్యక్తిత్వం అపూర్వకు చాలా నచ్చడంతో... తానే అమ్మాయిని అయ్యి ఉంటే.. శ్రీహరిని తప్పకుండా పెళ్లి చేసుకొని ఉండే వాడినని అపూర్వ లాఖియా ఒక సందర్భంలో చెప్పి అక్కడున్నవారిని ఆశ్చర్యపోయేలా చేసాడంట.
ఇటివలే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై దర్శకుడు అపూర్వ పూర్తి నమ్మకంతో ఉన్నాడట. మరి ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధిస్తే.. శ్రీహరి గురించి అపూర్వ లాఖియా ఇంకా ఏమేం విషయాలు చెబుతాడో చూడాలి.