ముద్దుకి ఆరోజు బాగుందట...!
on Sep 3, 2013
అడవి శేషు హీరోగా నటించిన తాజా చిత్రం "కిస్". అడవి సాయికిరణ్, శేషు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా అడవి శేషు తెలియజేసాడు. ఈ చిత్రంలో ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటించింది. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం కూడా విడుదలై మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు.