కథానాయికగా త్రిష ప్రస్థానానికి 19 ఏళ్ళు!
on Dec 13, 2021

ఒక దశలో తెలుగు, తమిళ భాషల్లో నంబర్ వన్ నాయికగా రాణించిన వైనం చెన్నై పొన్ను త్రిష సొంతం. అంతేకాదు.. ఈ రెండు భాషల్లో దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ ఆడిపాడి వార్తల్లో నిలిచింది. అదేవిధంగా హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి భారతీయ నటిగా గుర్తింపు పొందింది. అలాగే `ఉత్తమ నటి`గా పలు పురస్కారాలు కైవసం చేసుకుంది.
నాకు టెన్షన్ గా ఉంది.. బన్నీ ఫోటో పట్టుకెళ్లండి!
ఇదిలా ఉంటే.. ప్రశాంత్, సిమ్రన్ జంటగా నటించిన `జోడి`(1999) అనే తమిళ చిత్రంతో నటిగా తొలి అడుగులు వేసిన త్రిష.. అందులో సిమ్రన్ స్నేహితురాలి పాత్రలో పెద్దగా ప్రాధాన్యం లేని వేషంలో కాసేపు దర్శనమిచ్చింది. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన `మౌనం పేసియాదే` (తెలుగులో `ఆడంతే అదో టైపు` పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది)తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయం చూసింది. 2002 డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమా తరువాత త్రిష.. అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఎక్కువగా కనిపించి కాలక్రమంలో అగ్రతారగా వెలుగొందింది.
ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది. ఈ డిసెంబర్ 13తో నాయికగా 19 ఏళ్ళ ప్రస్థానం పూర్తిచేసుకుంటున్న త్రిష.. మున్ముందు మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రల్లో అలరిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



