నాకు టెన్షన్ గా ఉంది.. బన్నీ ఫోటో పట్టుకెళ్లండి!
on Dec 12, 2021

కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'తో విలన్ అవతారం ఎత్తాడు. ఈ సినిమాలో మంగళం శ్రీను అనే నెగటివ్ రోల్ లో సునీల్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సునీల్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. విలన్ గా సునీల్ ఎలా మెప్పిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. అయితే సునీల్ మాత్రం తనని మర్చిపోయి, ఒక కొత్త నటుడు అనుకొని ఈ సినిమా చూడమని చెబుతున్నాడు.
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "అప్పుడు ఇదే ప్లేస్ లో నిల్చొని 'అల వైకుంఠపురములో' సినిమా మంచి పెళ్లి భోజనం తిన్నట్లు ఉంటుందని చెప్పా. పుష్ప సినిమా మాత్రం రిసెప్షన్ మీల్స్ లా ఉంటది. మంచి దావత్. పెళ్లి భోజనం మిస్ అయినా పర్లేదు గానీ దీన్ని మిస్ అవ్వకూడదు. ఈ సినిమా చూశాక కనీసం ఒక వారం ఈ సినిమా మీ మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది." అని సునీల్ అన్నారు.
"మాములుగా ఎవరైనా విలన్ గా నటించాలంటే డైరెక్ట్ గా ట్రై చేస్తారు. ఐదేళ్లు పట్టొచ్చు, ఏడేళ్లు పట్టొచ్చు.. వాళ్ళు డైరెక్ట్ విలన్ అవుతారు. కానీ నేను ఈ సినిమాలో విలన్ అవ్వడానికి.. ముందు 300 సినిమాలు కమెడియన్ గా, పది సినిమాలు హీరోగా చేస్తే గానీ అవ్వలేదు. విలన్ కావాలన్న నా కోరిక తీర్చిన సుకుమార్ గారికి, దీన్ని నమ్మిన బన్నీ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు మీరంతా బన్నీ ఫోటో పట్టుకెళ్లండి. నన్ను ఇంతకముందు సినిమాలు గుర్తుచేసుకొని చూడొద్దు. ఈ సినిమాకి నన్ను ఫ్రెష్ గా చూడండి. ఒకవేళ నేను గుర్తొస్తే, వెంటనే బన్నీ ఫోటో చూడండి. మిగతా భాషల్లో నాకు టెన్షన్ లేదు. ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు నన్ను. డైరెక్ట్ విలన్ అనుకుంటారు నన్ను. నాకు ఇక్కడే టెన్షన్. ఈ సినిమాలో నన్ను కొత్తోడిలా చూడండి. తరువాత నవ్విస్తాను.. ఈ సినిమాకి మాత్రం మిమ్మల్ని కొంచెం భయపడతాను." అని సునీల్ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



