దీపికాపదుకునే కి మద్దతుగా త్రిప్తి డిమ్రి! సందీప్ రెడ్డి వంగ వాట్ నెక్స్ట్
on Oct 7, 2025

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్(Prabhas),దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)వంగ కాంబినేషన్ లో 'స్పిరిట్'(Spirit)తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా పేరు పొందింది. అలాంటి ఈ ప్రాజెక్ట్ లో భాగమైతే నటీనటుల కెరీర్ కి తిరుగుండదు. ఈ మూవీలో మొదట 'దీపికా పదుకునే' ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమెని తప్పించి యానిమల్ బ్యూటీ 'త్రిప్తి డిమ్రి'ని ఫిక్స్ చేసారు. దీంతో దీపికా, త్రిప్తి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే న్యూస్ కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. కానీ రీసెంట్ గా జరిగిన ఒక సంఘటనతో అలాంటి వార్తలన్నింటికి త్రిప్తి చెక్ పెట్టినట్లయింది.
సోషల్ మీడియాలో ఒక యూజర్ దీపికా పదుకునే గురించి ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో దీపికా గతంలో రామ్ లీలా(Ram leela)మూవీలోని ఒక పాట కోసం సుమారు ముప్పై కేజీల బరువు ఉన్న లెహంగా ధరించి డాన్స్ చేసారు. కాలికి రక్తం వస్తున్నప్పటికీ ఆపకుండా డాన్స్ చేసారని తెలిపాడు. ఇప్పుడు ఈ పోస్ట్ కి త్రిప్తి లైక్ చేసింది. దీంతో దీపికా అభిమానులు త్రిప్తి ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్ మూవీలో అధ్బుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించడంతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందిన విషయం తెలిసిందే.
ఇక రామ్ లీలా మూవీని 'గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలా' అని కూడా పిలుస్తారు. రొమాంటిక్ ట్రాజెడీ డ్రామాగా లెజండ్రీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి(Sanjay Leela Bhansali) తెరకెక్కించాడు.ఇందులోని పాటలకి, కొరియోగ్రఫీ కి మంచి పేరు రావడంతో పాటు, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు ని సైతం అందుకుంది. మొత్తం పదకొండు పాటలు ఉండగా సిద్దార్ధ్ ,గరిమ ద్వయం మ్యూజిక్ ని అందించింది. రణవీర్ సింగ్ హీరో కాగా 2013 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



