పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబో రెడీ! సబ్జెక్ట్ ఇదేనా!
on Oct 7, 2025

కొన్ని కాంబినేషన్స్ ని ఎవరు ఊహించలేరు. కానీ ఆ కాంబోలో సినిమా తెరకెక్కబోతుందనే న్యూస్ వస్తే చాలు, ఎప్పుడెప్పుడు ఆ చిత్రం షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని, సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక క్రేజీ కాంబోకి అడుగులు పడబోతున్నాయనే న్యూస్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)రీసెంట్ గా 'ఓజి'(OG)తో తన ఖాతాలో మరో భారీ హిట్ ని అందుకున్నాడు. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రం తర్వాత అగ్ర నిర్మాత 'దిల్ రాజు'(Dil Raju)నిర్మాణ సారధ్యంలో ఒక మూవీ చెయ్యబోతున్నాడనే వార్తలు కొన్నిరోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడిగా అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యారనే వార్తలు తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా సదరు న్యూస్ వైరల్ గా మారింది. హీరో ఇమేజ్ ని బట్టి సబ్జెట్ ని రూపొందించడంతో పాటు, సదరు సబ్జెట్ లో మాస్, కమర్షియల్, ఎంటర్ టైన్మెంట్ అంశాలని జోడించడంలో అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి తిరుగులేదు. ఇందుకు ఆయన తెరకెక్కించిన గత చిత్రాలే ఉదాహరణ. పైగా ప్రస్తుతం భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస విజయాల్ని అందుకున్నాడు. ప్రేక్షకులు కూడా అనిల్ రావిపూడి సినిమాలంటే థియేటర్ కి పరుగులు తీస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ సబ్జెట్స్ ని రూపొందించడంలో ప్రస్తుతం అనిల్ రావిపూడి అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో సినిమా తెరకెక్కించడం ఖాయమైతే, పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కథని రూపొందిస్తాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఏర్పడింది. అనిల్ రావిపూడి క్రియేటివిటీ కి పవన్ పర్ఫెక్ట్ గా సూటవుతాడు. ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పవన్ నటించాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు.
పైగా పవన్ కూడా కామెడీ లో విజృంభించి చేయగలడు. ఈ నేపథ్యంలో పవన్ , అనిల్ రావిపూడి కాంబో తెరకెక్కడం ఖాయమైతే సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త వండర్స్ సృష్టించడం ఖాయం. అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi)తో 'మన శంకర వరప్రసాద్ గారు'(mana shankara vara prasad Daru) తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తన స్టైల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ ని జోడిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాతే పవన్ తో సినిమా ఉండవచ్చని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



