మహాత్మా గాంధీ పై శ్రీకాంత్ అయ్యంగార్ దారుణమైన విమర్శలు
on Oct 7, 2025

ఏ క్యారక్టర్ లోకైనా ఒదిగిపోయి నటించే నటుల్లో 'శ్రీకాంత్ అయ్యంగార్'(Srikanth Iyengar)ఒకరు. తెలుగు సినిమాకి శ్రీకాంత్ అయ్యంగార్ రూపంలో మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ దొరికాడని కూడా చెప్పుకోవచ్చు. రాజరాజ చోర, సామజవరాగమన, నాంది, డెవిల్, బ్రోచేవారెవరురా వంటి చిత్రాల్లోని క్యారక్టర్ లు శ్రీకాంత్ అయ్యంగార్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)లో కూడా కనపడ్డాడు.
శ్రీకాంత్ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా జాతిపిత మహాత్మాగాంధీ(Mahatma Gandhi)ని విమర్శిస్తు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసాడు. అందులో శ్రీకాంత్ మాట్లాడుతు గాంధీ మహాత్ముడేమి కాదు. ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. మన దేశానికి స్వాతంత్రం కూడా గాంధీ తీసుకురాలేదు. సుభోష్ చంద్రబోస్(subhash chandra bose),భగత్ సింగ్(Bhagat singh) వంటి వారు తీసుకొచ్చారని సదరు వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
2013 లో చమ్మక్ చల్లో అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీకాంత్ అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాల వరకు చేసాడు. దర్శకుడిగా కూడా జగపతిబాబు, భూమిక తో 'ఏప్రిల్ పూల్' అనే చిత్రాన్ని తెరకెక్కించగా, 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



