2023 వేసవి బరిలో టాప్ స్టార్స్!
on Jul 13, 2022
.webp)
ఈ ఏడాది వేసవిలో `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య`, `సర్కారు వారి పాట`, `ఎఫ్ 3` వంటి స్టార్ హీరోల చిత్రాలు సందడి చేశాయి. కట్ చేస్తే.. వచ్చే సంవత్సరం సమ్మర్ లో మరిన్ని బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ రూపొందిస్తున్న `భోళా శంకర్` మార్చి ద్వితీయార్ధంలో తెరపైకి రాబోతుండగా.. నటసింహం నందమూరి బాలకృష్ణతో వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న సినిమా కూడా సేమ్ సీజన్ లో వినోదాలు పంచనుందని సమాచారం. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తయారవుతున్న `#SSMB 28` కూడా వేసవిని లక్ష్యం చేసుకుంది. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోతున్న `ఎన్టీఆర్ 30`.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న `సలార్`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో శంకర్ రూపొందిస్తున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కూడా 2023 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానున్నాయని టాక్. మరి.. 2023 సమ్మర్ లో వీరిలో ఎవరెవరు విజయాలను సొంతం చేసుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



