ఐఎండీబీ రిలీజ్ చేసిన 2022 టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే!
on Jul 13, 2022

మనం ఇప్పటికే 2022 సెకండాఫ్‌లో ఉన్నాం. ఈలోపు అనేక సినిమాలు, వెబ్ సిరీస్, వాటిలోని క్యారెక్టర్లు మనల్ని ఉర్రూతలూగించాయి. దేశంలో ఇప్పటివరకూ అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్‌లను ఐఎండీబీ బుధవారం విడుదల చేసింది. మూవీస్‌లో 'ద కశ్మీర్ ఫైల్స్', వెబ్ సిరీస్‌లలో 'కాంపస్ డైరీస్' టాప్‌లో నిలిచాయి.
భారతదేశంలోని IMDb వినియోగదారుల పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ లిస్టులను తయారుచేశారు. సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల సమాచారం విషయంలో అత్యంత పాపులర్ వేదిక అయిన ఐఎండీబీ, భారతదేశంలోని ప్రేక్షకుల ప్రకారం (ఇప్పటివరకు) అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లను వెల్లడించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు, ప్రొఫెషనల్ క్రిటిక్స్ నుంచి వచ్చే రివ్యూలను ఆధారం చేసుకోకుండా, దేశంలోని IMDb వినియోగదారుల పేజ్ వ్యూస్‌ను లెక్కించే IMDbPro డేటా ఆధారంగా ఈ లిస్టును IMDb రూపొందిస్తుంది.
మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్‌లో 'ద కశ్మీర్ ఫైల్స్' టాప్ స్పాట్‌లో నిలవగా, దాని తర్వాత స్థానాల్లో కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ కథియవాడి, విక్రమ్ నిలిచాయి.
2022లో ఇప్పటివరకూ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాలు
ద కశ్మీర్ ఫైల్స్, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ కథియవాడి, విక్రమ్, ఝుండ్, సమ్రాట్ పృథ్వీరాజ్, రన్‌వే 34, ఎ థర్స్‌డే, హృదయమ్.

థియేటర్లలో కానీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కానీ జనవరి 1 నుంచి జూలై 5 వరకు విడుదలైన సినిమాల్లో ఐఎండీబీ వినియోగదారులు ఇచ్చిన 7 అంతకంటే ఎక్కువ రేటింగ్ సినిమాల్లో ఈ పది సినిమాలు ఇండియాలో ఎక్కువ ఐఎండీబీ పేజ్ వ్యూస్‌ను సాధించాయి.
ఇక అత్యంత ప్రజాదరణ పొందిన విబ్ సిరీస్‌ల విషయానికొస్తే, 'క్యాంపస్ డైరీస్' (ఎంఎక్స్ ప్లేయర్) అగ్రస్థానంలో నిలవగా, దాని తర్వాత స్థానాలను ద గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీప్లస్ హాట్‌స్టార్), రాకెట్ బాయ్స్ (సోనీ లివ్), పంచాయత్ (ప్రైమ్ వీడియో), హ్యూమన్ (డిస్నీప్లస్ హాట్‌స్టార్) పొందాయి.
2022లో ఇప్పటివరకూ అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ వెబ్ సిరీస్
క్యాంపస్ డైరీస్ (ఎంఎక్స్ ప్లేయర్), ద గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీప్లస్ హాట్‌స్టార్), రాకెట్ బాయ్స్ (సోనీ లివ్), పంచాయత్ (ప్రైమ్ వీడియో), హ్యూమన్ (డిస్నీప్లస్ హాట్‌స్టార్), యే కాలీ కాలీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్), అపహరణ్ (వూట్ అండ్ ఆల్ట్‌బాలాజీ), ఎస్కేప్ లైవ్ (డిస్నీప్లస్ హాట్‌స్టార్), మాయి (నెట్‌ఫ్లిక్స్), ద ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్).

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



