టాలీవుడ్ లో రేపటి నుంచి షూటింగ్స్ బంద్!
on Jun 21, 2022
కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. సినీ పరిశ్రమ కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపడుతున్నారు.
టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. సినిమా బడ్జెట్ లు, రెమ్యూనరేషన్స్ పెరుగుతున్నా.. తమ వేతనాలు మాత్రం పెరగడం లేదంటూ సినీ కార్మికులు సమ్మెకు రెడీ అయ్యారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినా.. నిర్మాతల మండలి నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగుతున్నారు. వేతనాలు పెంచేవరకు రేపటి(బుధవారం) నుంచి షూటింగ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే రేపు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు.
సినీ కార్మికులు సమ్మెకు దిగితే రేపటి నుంచి షూటింగ్ లకు బ్రేక్ పడే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
