కృష్ణ వంశీ మార్క్ తో 'రంగమార్తాండ' టైటిల్ లోగో
on Jul 8, 2022

'గులాబీ', 'నిన్నే పెళ్లాడతా', 'సిందూరం', 'అంతఃపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో క్రియేటర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. టైటిల్ లోగోలో కృష్ణ వంశీ మార్క్ కనిపిస్తోంది. టైటిల్ లోగోలో ప్రధాన పాత్ర ధారులు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ఫోటోలు ఉండటం విశేషం.

రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. రంగమార్తాండ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



