విక్రమ్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. అసలేం జరిగిందో చెప్పిన కావేరి!
on Jul 8, 2022

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారని వార్తలొస్తున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా కావేరి హాస్పిటల్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
విక్రమ్ గుండెపోటుకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కావేరి వైద్యులు హెల్త్ బులిటెన్ ద్వారా చెప్పారు. ఛాతిలో అసౌకర్యం కారణంగా ఆయన కావేరి హాస్పిటల్‌లో చేరారని, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆయనకు చికిత్స అందించారని తెలిపారు. ఆయనకు గుండెపోటు రాలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

కావేరి హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తో విక్రమ్ అభిమానుల్లో ఆందోళన తొలిగిపోయినట్లే అని చెప్పొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



