లిస్ట్‌లో ఒక్క సక్సెస్ఫుల్ హీరోయిన్ కూడా లేదు
on Mar 14, 2018

టైమ్స్ హైదరాబాద్ మోస్ట్ డిజైరెబల్ మెన్ లిస్ట్ లో టాప్ స్టార్స్ అందరినీ పక్కకు నెట్టి, రెండో స్థానం దక్కించుకొని విజయ్ దేవరకొండ షాక్ ఇస్తే, ఇప్పుడు మోస్ట్ డిజైరెబల్ విమెన్ లిస్ట్ యే పెద్ద షాక్ గా మారింది. ఎందుకంటే ఈ లిస్ట్ లో ఒక్క సక్సెస్ఫుల్ హీరోయిన్ కూడా లేదు. కేవలం పాపులారిటీ ని పరిగణలోకి తీసుకొని ఓట్లు ఇవ్వబడతాయి. తన కెరీర్ లో ఇంతవరకు ఒక్క హిట్టు కూడా కొట్టని పూజ హెగ్డే కి అగ్ర స్థానం లభించగా, కెరీర్ చివరి దశకి చేరుకున్న కాజల్ అగర్వాల్ రెండో పొజిషన్ సంపాదించింది. ఇంకా ఈ లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్, PV.సింధు, అదా శర్మ, తమన్నా, సిమ్రాన్ చౌదరి, శ్రీష్టి వ్యాకరణం, అనుష్క శెట్టి, మిథాలీ రాజ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సింధు మరియు మిథాలీ క్రీడాకారులు కాగా, సిమ్రాన్ చౌదరి మరియు శ్రీష్టి వ్యాకరణం 2017 సంవత్సరానికి గానూ అందాల పోటీలో పాల్గొన్నారు. సినిమా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్న రకుల్, తమన్నా, అదా కి ఈ లిస్ట్ లో చోటు దక్కడం ఆశ్చర్యకర విషయం. ఇక భాగమతి తర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోని అనుష్కకి తొమ్మిదో స్థానం దక్కడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



