మెగాస్టార్‌కి అనారోగ్యం, టెన్షన్స్‌లో సైరా యూనిట్
on Mar 14, 2018
.jpg)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. నాగార్జున మనం లో గెస్ట్ రోల్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బిగ్ బి, ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో అమితాబ్ సైరా యూనిట్ తో జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పుడు అలా జరిగే సూచనలు కనపడటం లేదు. బాలీవుడ్ సినిమా థగ్స్ అఫ్ హిందుస్థాన్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న బిగ్ బి, ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అస్వస్థకు గురయి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ప్రస్తుతం, బిగ్ బి హెల్త్ కండిషన్ స్టడీ గా ఉన్నప్పటికీ, కాస్త రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. సో, అమితాబ్ కొన్ని రోజులు షూటింగ్ కి దూరం గా ఉండే పరిస్థితి. దీంతో, ఆయన ఇప్పట్లో సైరా షూటింగ్ కి వచ్చే అవకాశం లేదు. సో, ఈ పరిస్థితి సైరా యూనిట్ కి టెన్షన్స్ తెప్పిస్తుంది. ఇప్పటికే నత్త నడకన సాగుతున్న షూటింగ్, మరింత డిలే అయ్యే అవకాశం ఉంది. అయితే, బిగ్ బి కోసం వేచి చూడకుండా ఈ మధ్యలో మిగతా సన్నివేశాలు తీసే ఆలోచనలో ఉన్నారట సైరా మేకర్స్. ఏది ఏమయినా, బిగ్ బి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



