రాజమౌళి తండ్రిని కలవనున్న అమిత్ షా
on Mar 14, 2018

బాహుబలి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి కథలు అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా త్వరలో కలవనున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ, వీరి కలయిక వెనుక కారణం ఏంటో తెలుసా? బీజేపీ పెద్దలు ఆరెస్సెస్ ఆర్గనైజేషన్ పైన ఒక సినిమా చేద్దాం అని యోచనలో ఉన్నారట. దేశాన్ని యేలే శక్తి గా బీజేపీ ఎలా ఎదిగింది, అందులో ఆరెస్సెస్ భాగస్వామ్యం లాంటి అంశాలు మేళవించి కథ రాయమని విజయేంద్ర ప్రసాద్ ని అడిగారట. ఆరెస్సెస్ పెద్దలతో బాహుబలి రైటర్ ఆల్రెడీ డిస్కషన్స్ మొదలు పెట్టాడట. త్వరలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రసాద్ గారిని కలిసి తన సూచనలు కూడా ఇస్తాడట. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాని ఒక బాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. Dr.హెడ్గేవార్, MS. గోల్వాల్కర్,సావర్కర్,సుదర్శన్ లాంటి వారు ఆరెస్సెస్ కోసం తమ జీవితాల్ని ఎలా పణంగా పెట్టారో ఈ సినిమా వివరిస్తుంది అంటున్నారు. మరి, విజయేంద్ర ప్రసాద్ లాంటి రైటర్ స్టోరీ ఇస్తున్నారు కాబట్టి సినిమాలో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



