అప్పుడు `వర్షం`.. ఇప్పుడు `రాధే శ్యామ్`!
on Dec 2, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి తొలి బ్లాక్ బస్టర్ ని అందించిన చిత్రం `వర్షం`. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2004 సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న రిలీజైంది. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. అదే జనవరి 14న 18 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో రొమాంటిక్ డ్రామాతో రాబోతున్నారు ప్రభాస్. ఆ చిత్రమే.. `రాధే శ్యామ్`. పిరియడ్ లవ్ సాగాగా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. భారీ అంచనాల నడుమ పొంగల్ సీజన్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `వర్షం`, `రాధే శ్యామ్` చిత్రాలకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన `బాబీ` చిత్రంతో పరిచయమైన దర్శకుడు శోభన్ కి `వర్షం` సెకండ్ డైరెక్టోరియల్. `బాబీ` డిజప్పాయింట్ చేసినా.. `వర్షం` అతని కెరీర్ ని కీలక మలుపు తిప్పింది. ఇక `రాధే శ్యామ్` విషయానికి వస్తే.. ఆ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి కూడా ఇది రెండో సినిమానే. గతంలో మ్యాచో స్టార్ గోపీచంద్ తో `జిల్` తీశాడు రాధాకృష్ణ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది. మరి.. శోభన్ కి సెకండ్ మూవీతో అచ్చొచ్చిన ప్రభాస్.. రాధాకృష్ణకి కూడా ఆ ఫీట్ ని రిపీట్ చేసి సెన్సేషనల్ హిట్ ని అందుకుంటారేమో చూడాలి.
కాగా, `వర్షం`లో త్రిష నాయికగా నటించగా.. `రాధే శ్యామ్`లో పూజా హెగ్డే హీరోయిన్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
