'లక్ష్య' పైనే `రొమాంటిక్` భామ ఆశలు!
on Dec 2, 2021

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాశ్ కథానాయకుడిగా నటించిన `రొమాంటిక్` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కేతికా శర్మ. తన హాట్ లుక్స్ తో, యాక్టింగ్ స్కిల్స్ తో కుర్రకారుని ఫిదా చేసింది. అయితే ఎంతగా అందాల విందు చేసినా కమర్షియల్ హిట్ నైతే తన ఖాతాలో వేసుకోలేకపోయింది మిస్ శర్మ.
ఇదిలా ఉంటే.. `రొమాంటిక్` విడుదలైన దాదాపు ఒకటిన్నర నెలల తరువాత మరో సినిమాతో పలకరించబోతోంది కేతికా శర్మ. ఆ సినిమానే.. `లక్ష్య`. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా నటించగా.. అతనికి జోడీగా కేతిక దర్శనమివ్వనుంది. కేవలం పాటలకే పరిమితం కాకుండా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో ఆమె కనిపించబోతోందని ప్రచార చిత్రాలని బట్టి స్పష్టమవుతోంది. మరి.. డిసెంబర్ 10న రిలీజ్ కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామాతో కేతికా శర్మకి ఫస్ట్ హిట్ సొంతమవుతుందేమో చూడాలి.
`లక్ష్య`లో విలక్షణ నటుడు జగపతి బాబు, సచిన్ ఖేద్కర్, సత్య, రవి ప్రకాశ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



