'ది వారియర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. టార్గెట్ కొండంత, వచ్చింది ఇంత!
on Jul 15, 2022

రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన 'ది వారియర్' సినిమా నిన్న(జులై 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోకి డివైడ్ టాక్ తెచ్చుకోవడం, పైగా వర్షాలు పడుతుండటంతో ఓపెనింగ్స్ మరీ దారుణంగా వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే పర్లేదు అనుకునేలా ఓపెనింగ్స్ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో హైర్స్ రూ.1.60 కోట్లతో కలిపి ఈ చిత్రం మొదటి రోజు 7.02 కోట్ల షేర్(10.20 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఫస్ట్ డే నైజాంలో 1.95 కోట్ల షేర్, సీడెడ్ లో 1.06 కోట్ల షేర్, ఆంధ్రాలో 4.01 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రామ్ గత చిత్రాలు 'ఇస్మార్ట్ శంకర్', 'రెడ్' ఫస్ట్ డే వరుసగా 7.73 కోట్ల షేర్, 5.47 కోట్ల షేర్ రాబట్టాయి.
'ది వారియర్' మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 8.02 కోట్ల షేర్(12.20 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. తమిళనాడులో రూ.30 లక్షలు, రెస్టాఫ్ ఇండియా 40 లక్షలు, ఓవర్సీస్ 30 లక్షల షేర్ రాబట్టింది. బైలింగ్వెల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.
టైర్ 2 హీరో సినిమాకి మొదటి రోజు 8 కోట్ల షేర్ రావడం చెప్పుకోదగ్గ విషయమే అయినప్పటికీ.. 'ది వారియర్' థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే మాత్రం ఓపెనింగ్స్ తక్కువగా వచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 40 కోట్ల బిజినెస్ చేయగా.. ఫస్ట్ డే 20 మాత్రమే రికవరీ అయింది. పైగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా రాలేదు. ఫస్ట్ వీకెండ్ లో కనీసం 20 కోట్ల షేర్ వస్తేనే బయ్యర్లు కోలుకునే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



