డిజాస్టర్ దిశగా నాగార్జున 'ఘోస్ట్'!
on Oct 7, 2022
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ 'ది ఘోస్ట్' డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని కలిగించింది కానీ విడుదలయ్యాక మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దానికితోడు నెగటివ్ టాక్ రావడంతో రెండు రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ది ఘోస్ట్' మొదటి రోజు రూ.2 కోట్ల షేర్ రాబట్టగా రెండో రోజు రూ.0.76 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇప్పటిదాకా నైజాంలో రూ.81 లక్షల షేర్, సీడెడ్ లో రూ.38 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.57 కోట్ల షేర్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.2.76 కోట్ల షేర్ రాబట్టింది.
అలాగే కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.25 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.35 లక్షల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 3.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.21.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో రూ.3 కోట్ల షేర్ రాబడితే గొప్ప అన్నట్టుగా ఉంది. అదే జరిగితే బయ్యర్లకు రూ.15 కోట్ల నష్టం తప్పదు.
Also Read