దివికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చిరు!
on Oct 7, 2022
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ మాటకు తిరుగే లేదు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే అది ఆరు నూరైనా జరిగి తీరాల్సిందే. ఈ విషయంలో ఆయన్ని మెచ్చుకోక తప్పదు. రీసెంట్ గా చిరు మూవీ 'గాడ్‌ఫాదర్' రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సునీల్ భార్య పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్య నటించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమెది కూడా ఒక కీ రోల్. బిగ్ బాస్ సీజన్ 4 లో దివి కంటెస్టెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఆ సీజన్ గ్రాండ్ ఫినాలేకి చిరు గెస్ట్ గా వచ్చారు. గ్రాండ్ ఫినాలేలో ఆయన దివితో మాట్లాడుతూ హౌస్ నుంచి బయటికి వచ్చాక తన నెక్స్ట్ మూవీలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. తను ఇచ్చిన మాట మర్చిపోకుండా 'గాడ్‌ఫాదర్' మూవీతో దాన్ని నిలబెట్టుకున్నారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'మహర్షి' సినిమాలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది దివి. కానీ ఆ రోల్ అంతగా పేరు తేలేదు.
తర్వాత "క్యాబ్ స్టోరీస్"తో హీరోయిన్గా అలరించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక దివి తెగ పాపులర్ ఐపోయింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరో పక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాన్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.