తండేల్ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
on Feb 10, 2025

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న తండేల్ మూవీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.62 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో తండేల్ సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు మేకర్స్. (Thandel Movie)
తండేల్ సక్సెస్ మీట్ ను రేపు(ఫిబ్రవరి 11) నిర్వహించబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ వేడుకకు నాగార్జున చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ స్పెషల్ గెస్ట్ లుగా హాజరు రానున్నారు. ట్రిడెంట్ హోటల్ లో రేపు సాయంత్రం ఈ ఈవెంట్ జరగనుంది.
తండేల్ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల అక్కినేని అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే చైతన్య కెరీర్ లో వంద కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా తండేల్ నిలవనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



