సభ్యసమాజం తలదించుకునే పని.. రణవీర్ పై కేసు నమోదు..!
on Feb 10, 2025

మన దేశంలో తల్లిదండ్రులను ఎంతో గౌరవిస్తాము. వారి గురించి ఒక చెడు మాట మాట్లాడటానికి కానీ, అసభ్యకర జోకులు వేయడానికి కానీ మనసు ఒప్పదు. అలాంటిది లక్షల మంది వీక్షించే షోలో ఒక ప్రముఖ యూట్యూబర్ తల్లిదండ్రుల గురించి సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యకర ప్రశ్న అడిగాడు. (Ranveer Allahbadia)
ప్రముఖ యూట్యూబర్లు రణవీర్ అల్లాబాడియా, సమయ్ రైనా దిగజారి ప్రవర్తించారు. రైనా హోస్ట్ చేసే 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో రణవీర్ ఒక కంటెస్టెంట్ ను తల్లిదండ్రుల శృంగారానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు. అసలే ఆ షో రోజురోజుకి శృతి మించుతోంది అంటే.. ఇప్పుడేకంగా తల్లిదండ్రుల శృంగారం గురించి మాట్లాడటంతో సమాజం భగ్గుమంది. వారిపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు.
ఈ విషయం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఆయన ఇద్దరు యూట్యూబర్స్ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ కి సిద్ధమయ్యారు. మహిళా కమిషన్ సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వారు దారిలోకి వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



