అయన చూపు.. అటువైపు.. ఎందుకో మరి..!
on May 17, 2017

నటుడిగా మొదలైన కెరీర్ నచ్చే సంగీతం వైపుకు మరల్చింది. బాయ్స్ చిత్రంలో నటుడిగా కనిపించి..కిక్, బిజినెస్‌మ్యాన్, దూకుడు, రేసుగుర్రం, సరైనోడు వంటి చిత్రాలకు సాటిలేని సంగీతాన్ని అందించిన ఎస్ ఎస్ థమన్ బాలీవుడ్ వైపు వెళ్తున్నట్లు చెప్పేసాడు.ఆయన ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న హిందీ చిత్రం ‘గోల్‌మాల్ 4’కు థమన్ సంగీతం అందించనున్నారు.
ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంగీత ప్రియులను కలవరపెడుతోంది.ఎందుకంటే ఆయన సంగీతం అందించిన తెలుగు చిత్రాలు భారీ ఆదరణను పొందాయి.ఆయన అటు వైపు అడుగులు వేయనుండడం తో టాలీవుడ్ కు ఆయన టాటా చెప్పేస్తున్నాడా ..అనే అనుమానాలు నెలకొన్నాయి.లేదా బాలీవుడ్ లో తన ప్రతిభను నిరూపించుకునేందుకు వెళ్లాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.తన మ్యూజిక్ మాల్ ను రోహిత్ శెట్టి తీయనున్న'గోల్ మాల్ 4 'చూపించనున్నాడు.అయన అక్కడ తన సంగీతంతో ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తుంది.బాలీవుడ్ లో తన సంగీత బలాన్ని చూపించి తనదైన ముద్ర వేసుకొని అక్కడే స్థిర పడతాడో ఏమో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



