కాజల్‌కి రూ.2 కోట్లు కావాలట!!
on May 17, 2017

ఫేడవుట్ అయిపోతున్న కథానాయికల జాబితాలో కాజల్ పేరు తప్పకుండా ఉంటుంది. నవతరం భామల జోరు ముందు.. కాజల్ నిలవలేకపోతోంది. ఈమధ్య సినిమాలు బాగా తగ్గిపోయాయి. చేసిన సినిమాలూ సరిగా ఆడడం లేదు. కాజల్ పని తెలుగులో ఖతం అనుకొంటున్నారంతా. ఇలాంటి దశలో ఏ కథానాయిక అయినా ఏం చేస్తుంది?? ఏ అవకాశం వచ్చినా, టక్కున ఒప్పేసుకొంటుంది. పారితోషికం విషయంలో ఓ మెట్టు దిగి ఆలోచిస్తుంది. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. అయితే... కాజల్ మాత్రం ఇందుకు రివర్స్ గా ఆలోచిస్తోంది.
పారితోషికం తగ్గించడం మానేసి.. డబుల్ చేసేసింది. అవును.. కాజల్ పారితోషికం ఇప్పటికీ... కోట్లమీదే ఉంది. ఇటీవల ఖైదీ నెం.150 సినిమా కోసం చిరుతో జోడీ కట్టింది కాజల్. ఆ సినిమా కోసం కోటి రూపాయలకు పైగానే పారితోషికం అందుకొంది. ఆ సినిమాసూపర్ హిట్టయినా కాజల్‌కి కొత్తగా అవకాశాలు రాలేదు. అయినా సరే.. పారితోషికం తగ్గించడం లేదు. సరికదా డబుల్ చేసేసింది. ఈమధ్య కల్యాణ్ రామ్ సినిమా కోసం కాజల్‌ని సంప్రదిస్తే... రెండు కోట్లు ఇస్తే తప్ప సంతకం చేయను అనేసిందట. కాజల్‌కి అవకాశాలు లేకపోయినా... పారితోషికం ఇంతిలా పెంచేసిందేంటి? అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు నిర్మాతలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



