ఆదిలోనే అధినేత ట్విట్టర్‌కు అడ్డంకులు..!?
on May 17, 2017

తనదైన శైలిలో ఎప్పటికప్పుడు సందేశాలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకునే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైందని తెలిసింది.దాంతో అయన పంచే సందేశాలు అభిమానులకు చేరడం కష్టంగా మారింది.దీన్ని గమనించిన సాంకేతిక బృందం మెరుగుపరిచే పనిలో పడ్డారు.అధినేత జనాలలోకి దూసుకుపోతున్నాడన్న నెపంతో అసూయపరులు చేశారేమో అని వినిపిస్తున్నది.ఆయన ట్విట్టర్ ఖాతాను లక్షల మంది అనుసరిస్తున్నారు.ఒకేసారి ఇలా ఎవరో హ్యాక్ చేయడం తో అభిమానులలో కలవరం మొదలైంది.జనసేన కార్యాలయ సిబ్బంది నిపుణులతో సుదీర్ఘ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఆదిలోనే అధినేత ట్విట్టర్ కు అడ్డంకులు రావడం వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయేమోనని అనుమానిస్తున్నారు.జనసేన పార్టీ అధినేత జోరుకు కళ్లెం వేయడం లాంటి పనులు కొంతమంది చేయడం పార్టీ మెరుగుదలకు ఉపయోగమే అని చర్చించుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



