విదేశాలకి ప్రముఖ హీరో.. వాళ్ళు కూడా ఉన్నారు
on May 11, 2024
.webp)
తెలుగు నాట రాజకీయ వాతావరణం ఫుల్ వేడిలో ఉంది. సినిమా వాళ్ళు కూడా మునుపెన్నడూ లేని విధంగా పలానా పార్టీ కి ఓటు వెయ్యమని చెప్తున్నారు. ఈ పరిణామాలని పక్కనే ఉన్న తమిళనాడు ప్రజలు కూడా గమనిస్తు ఉన్నారు.పైగా సినిమా వాళ్ళు కూడా పోటీ చేస్తుండటంతో ఎవరు గెలుస్తారనే క్యూరియాసిటీ కూడా ఉంది. ఎందుకంటే తమిళ సినీ పరిశ్రమకి తెలుగు సినిమా పరిశ్రమకి ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉంది. ప్రేక్షకులకే అంత టెన్షన్ ఉంటే హీరోలకి కూడా కొంచం టెన్షన్ ఉండాలి కదా. పైగా ఒక హీరో అయితే పొలిటికల్ పార్టీని కూడా స్థాపించాడు. కానీ ఇప్పుడు ఆ హీరో విదేశాలకి వెళ్తున్నాడు
ఇళయ దళపతి విజయ్ .. తమిళ అగ్ర హీరోల్లో ఒకడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. తాజాగా తమిళ మున్నేట్ర కజగం అనే పేరుతో పార్టీ కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ యుఎస్ వెళ్తున్నాడు. తన రీసెంట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం షూటింగ్ ని మేకర్స్ యు ఎస్ లో ప్లాన్ చేసారు
దీంతో తన టీం మెంబర్స్ తో కలిసి యు ఎస్ వెళ్తున్నాడు. ఏ పి లో ఎలక్షన్స్ జరుగుతున్న వేళ అక్కడి పరిస్థితులని విజయ్ గమించాల్సింది. ఎందుకంటే విజయ్ కూడా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాడు. పవన్ లాంటి సినీ స్టార్ స్థాపించిన జనసేన పార్టీ కూడా ఎలక్షన్స్ లో రెండో సారి పోటీ చేస్తుంది. ఈ పరిణామాలన్నింటిని గమించడం విజయ్ కి చాలా అవసరం

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజిఎస్ స్టూడియోస్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. 230 కోట్లకి పైగా పారితోషకాన్ని విజయ్ తీసుకున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



