ఎలక్షన్స్ కి అందరు కొంపలకి వెళ్తే కల్కి కి ఎవరు పని చేస్తారు
on May 11, 2024
.webp)
ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఒక డైలాగ్ చెప్తాడు. మనిషన్నాకా కాస్తంత కళాపోషణ ఉండాలి అని.. ఇప్పుడు ఈ డైలాగ్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది. ఆఫ్ కోర్స్ ఆయన కళాకారుడే అనుకోండి. కాకపోతే ఆఫ్ ది స్క్రీన్ కూడా కూసంత కళాపోషణ ఉండాలి. లేటెస్ట్ వీడియో ఒకటి నాగీ కళాకారుడే అని నిరూపిస్తుంది
నాగీ వైఫ్ నేమ్ ప్రియాంక దత్. ఈమె ఎవరో కాదు వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ కూతురు.ఇక ఆయన రెండో కూతురు పేరు స్వప్న దత్. ప్రియాంక అండ్ స్వప్న కలిసి సారొచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం , మెయిల్, మహానటి, జాతి రత్నాలు వంటి చిత్రాలని నిర్మించారు. ఇప్పుడు స్వప్న దత్ , నాగీ తో కలిసి ఒక వీడియో చేసింది.దాన్ని
అలా తన ఇనిస్టాగ్రమ్ స్టోరీలో ఉంచిందో లేదో విత్ ఇన్ సెకన్లలో వైరల్ గా మారింది. సీజీ వర్క్ చేస్తున్న వాళ్లంతా హైదరాబాద్ నుంచి ఎలెక్షన్స్ కి వెళ్లిపోయారని నాగీ అంటాడు. దాంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని స్వప్న అంటుంది .ఎవరు గెలిస్తే నాకెందుకండి నా షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి అంటూ నాగీ బదులిచ్చాడు. ఇప్పుడు ఈ ఫన్నీవీడియోనే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు. తమ దైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు, కాకపోతే ఆ వీడియో గురించి తెలిసిన విషయం ఏంటంటే కల్కి గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని

ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్టాలు ఎలక్షన్స్ ఫీవర్ లో ఉన్నాయన్నది ఎంత నిజమో.. ఆఫ్టర్ ఎలక్షన్స్ కల్కి ఫీవర్ ఉంటుందన్నది అంతే నిజం. వైజయంతి మూవీస్ పై అశ్వనీ దత్ 600 కోట్ల రూపాయిల భారీ వ్యయంతో కల్కి ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అన్ని ఏరియాలకి చెందిన బిజినెస్ అయిపొయింది. ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్,దీపికా పదుకునే వంటి మేటి నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



