'దళపతి 66' ఫస్ట్ లుక్.. స్టైలిష్ గా విజయ్
on Jun 21, 2022
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
రేపు(జూన్ 22 న) విజయ్ పుట్టిన రోజు కావడంతో ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్. "The Boss Returns" అంటూ విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సూట్ వేసుకొని స్టైల్ గా కూర్చొని, సీరియస్ గా చూస్తున్న విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ని కూడా రివీల్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ మూవీకి తమిళ వెర్షన్ లో 'వారిసు' అనే టైటిల్ పెట్టారు. తెలుగులో 'వారసుడు' టైటిల్ తో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, కుష్బూ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు మేకర్స్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
