2022 ఫస్టాఫ్ రివ్యూ2: బోల్తా పడ్డ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్!
on Jun 21, 2022
2022 ప్రథమార్ధంలో తెలుగునాట చెప్పుకోదగ్గ స్థాయిలో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేశాయి. అయితే, వీటిలో ఏవీ కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
గుడ్ లక్ సఖిః
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో కేరళకుట్టి కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటించింది. వాయిదాల పర్వం దాటుకుని ఎట్టకేలకు జనవరి 28న జనం ముందు నిలిచిన ఈ నగేశ్ కుకునూర్ డైరెక్టోరియల్.. బాక్సాఫీస్ ముంగిట బోల్తా పడింది.
భామా కలాపంః
సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ఫిబ్రవరి 11న ఆహా ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ అయింది. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఆశించిన స్పందన రాబట్టుకోలేకపోయింది.
బ్లడీ మేరీః
టాలెంటెడ్ యాక్ట్రస్ నివేదా పెతురాజ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ క్రైమ్ డ్రామా .. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 15న నేరుగా స్ట్రీమ్ అయింది. `కార్తికేయ`, `ప్రేమమ్` ఫేమ్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది.
జయమ్మ పంచాయితీః
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన `జయమ్మ పంచాయితీ`.. భారీ స్థాయిలో ప్రచారం జరుపుకుని మరీ మే 6న థియేటర్స్ లోకి వచ్చింది. విజయ్ కుమార్ కలివరపు డైరెక్ట్ చేసిన ఈ విలేజ్ డ్రామా.. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది.
విరాట పర్వంః
డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన నక్సలిజం బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ `విరాట పర్వం` కూడా ఓ రకంగా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ నే. వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా జూన్ 17న తెరపైకి వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా.. వసూళ్ళ పరంగా మాత్రం నిరాశపరిచింది.
మరి.. నాయికా ప్రాధాన్య చిత్రాలకు 2022 ఫస్టాఫ్ కలిసిరాని నేపథ్యంలో.. సెకండాఫ్ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి. ద్వితీయార్ధంలో `యశోద`, `శాకుంతలం`తో పాటు మరిన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఎంటర్టైన్ చేయబోతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
