'జైలర్'గా సూపర్ స్టార్
on Jun 17, 2022
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కెరీర్ లో 169వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'జైలర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు తాజాగా టైటిల్ పోస్టర్ ను విడులా చేశారు.
'కోలమావు కోకిల', 'డాక్టర్' సినిమాలతో రెండు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకొని డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసిన నెల్సన్.. తన మూడో సినిమాగా విజయ్ తో చేసిన 'బీస్ట్'తో నిరాశపరిచాడు. ఇప్పుడు సూపర్ స్టార్ తో సాలిడ్ హిట్ అందుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలనుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో నెత్తుటి మరకలతో వేలాడుతూ ఉన్న కత్తి కనిపిస్తోంది. ఈ పవర్ ఫుల్ పోస్టర్ చూస్తుంటే ఇది సూపర్ స్టార్ మార్క్ పక్క కమర్షియల్ సినిమా అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నెల్సన్ పూనకాలు తెప్పిస్తాడేమో చూడాలి.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
