నాని 'జెంటిల్ మన్'కి ఆరేళ్ళు!
on Jun 17, 2022
డిఫరెంట్ జానర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలుగు దర్శకుల్లో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకరు. 2016లో ఆయన తెరకెక్కించిన 'జెంటిల్‌మన్' కూడా ఓ వైవిధ్యభరిత ప్రయత్నమే. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో గౌతమ్, జయరామ్(జై)గా నేచురల్ స్టార్ నాని రెండు విభిన్న పాత్రల్లో ఎంటర్టైన్ చేశారు. నివేదా థామస్ (తెలుగులో కథానాయికగా తనకిదే తొలి చిత్రం), సురభి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వినయ్ వర్మ, ఆనంద్, శ్రీముఖి, తనికెళ్ళ భరణి, ప్రగతి, రోహిణి, సత్యం రాజేశ్, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పీజీ విందా విజువల్స్ ఈ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం 'జెంటిల్‌మన్'కి ప్రధాన బలంగా నిలిచాయి. ఇందులోని "చలి గాలి చూడు", "గుస గుస లాడే", "ఢింటక ఢింటక", "శాటర్ డే నైట్" అంటూ మొదలయ్యే గీతాలన్ని రంజింపజేశాయి. శ్రీదేవి మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'జెంటిల్ మన్'.. 2016 జూన్ 17న విడుదలై మంచి విజయం సాధించింది. కాగా, నేటితో ఈ చిత్రం ఆరేళ్ళు పూర్తిచేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
