రామ్ 'రెడ్'... తమిళ రీమేకే కానీ!
on Oct 30, 2019

రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న 'రెడ్' బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రారంభమైంది. ఆల్రెడీ రెండు రోజుల క్రితం రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. షార్ట్ హెయిర్, కొంచం పెరిగిన గడ్డంతో కొత్తగా కనిపించాడు. బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'తాడమ్'కు ఈ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రెడ్ ప్రారంభోత్సవంలో రామ్ స్పందించాడు. "తమిళ సినిమా సోల్ తీసుకుని, కథ సిద్ధం చేశాం. చాలా మార్పులు చేశాం" అని రామ్ అన్నారు. నవంబర్ 16న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ తొలి వారం లేదా రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాత స్రవంతి రవికిషోర్ సన్నాహాలు చేస్తున్నారు. రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్లో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల తర్వాత మూడో చిత్రమిది. తొలి రెండు చిత్రాలకు భిన్నమైన చిత్రమిది. ఇద్దరు రామ్ రెండు మూడు లుక్స్ లో కనపడతారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



