'ఆవిరి' కథకు... కలెక్టర్ ఆమ్రపాలికి లింకేంటి?
on Oct 30, 2019

కొన్ని కథలు భలే పుడతాయి. రవిబాబు దర్శకత్వం వహించిన 'ఆవిరి' కథ అలా పుట్టిందే. ఈ కథకు మూలం ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి వరంగల్ జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు నివసించిన బంగ్లా. అప్పట్లో వరంగల్ కలెక్టర్ బంగ్లాలో ఆత్మ ఉందని వార్తలు వచ్చాయి. అవి రవిబాబు కంట పడ్డాయి. బంగ్లాలో ఆత్మ ఉంటే? అనే పాయింట్ ఆయనకు నచ్చింది. ఆ ఐడియా కొన్ని రోజులు మెదడులో తిరిగి తిరిగి 'ఆవిరి' కథగా మారింది.
అవును, అవును 2 చిత్రాలకు ఆవిరి భిన్నంగా ఉంటుందని రవిబాబు చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తెగా నటించిన శ్రీముక్తపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిరి హారర్ సినిమా కాదని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా అని రవి బాబు చెప్పారు. ఈ సినిమాలో ఆవిరి కూడా క్యారెక్టర్ చేసిందట. ఆవిరి కథను ఎన్ని మలుపులు తిప్పింది? కథలో ఎటువంటి పాత్ర పోషించింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలని అంటున్నారు.
నవంబర్ 1 న 'ఆవిరి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేస్తున్నారు. తనకు 'దిల్' రాజు పది పదిహేనేళ్లుగా స్నేహితుడనీ, ఎప్పటినుండో ఇద్దరం కలిసే సినిమా చేయాలనుకుంటున్నామనీ, ఈ సినిమాతో కుదిరిందని రవిబాబు అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



