ఇదీ తెలుగు సినిమా స్టామినా అంటే!
on May 6, 2017
తెలుగు సినిమా అంటే తక్కువగా చూసే బాలీవుడ్ జనాలకి బాహుబలి 2 ఒక కనువిప్పు లాంటిది. మొదటి 8 రోజులకి గాను 925 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారాంతానికి 1000 కోట్లు వసూలు చేయడం ద్వారా చరిత్ర సృష్టించనుంది. అయితే, తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్ర ఒక సారి చూసుకుంటే, అబ్బురపరిచే విషయాలు మనకి తెలుస్తాయి. సీనియర్ ఎన్టీఆర్ నటించగా సి పుల్లయ్య దర్శకత్వం వహించిన లవ కుశ మొదటి కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిన సినిమా. బాలకృష్ణ ముద్దుల మామయ్య మొదటి 5 కోట్లు, మోహన్ బాబు పెదరాయుడు మొదటి 10 కోట్లు, బాలకృష్ణ సమరసింహా రెడ్డి మొదటి 15 కోట్లు, బాలకృష్ణ నరసింహ నాయుడు మొదటి 20 కోట్లు, మహేష్ బాబు పోకిరి మొదటి 30 కోట్లు, రామ్ చరణ్ మగధీర మొదటి 40 నుండి 80 కోట్లు, ప్రభాస్ బాహుబలి మొదటి 90 నుండి 190 కోట్లు, ప్రభాస్ బాహుబలి 2 మొదటి 200 కోట్ల పైగా షేర్లు కొల్లగొట్టిన సినిమాలు. ఇది తెలుగు సినిమా స్టామినా అంటే!