కరణ్ జోహార్‌కి నో చెప్పిన ప్రభాస్
on May 6, 2017

బాలీవుడ్ అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ బాహుబలి 2 హిందీ వెర్షన్ అనుకున్న స్థాయికన్నా ఘన విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ దశాబ్ది లో గొప్ప దర్శకుడు రాజమౌళే అని కితాబిచ్చిన ఆయన ఈ సందర్భంగా త్వరలో ఒక పెద్ద పార్టీ ఆరెంజ్ చేద్దాం అనుకున్నారు. దీనికి బాహుబలి యూనిట్ మొత్తం ఇన్వైట్ చేద్దాం అనుకున్నారు. ప్రభాస్ అమెరికా టూర్ ప్లాన్ చేసుకున్నాడని తెలిసి పార్టీ ని కొద్ది రోజులు పోస్ట్ ఫోన్ చేద్దాం అనుకున్నారు. కానీ, ప్రభాస్ అసలు పార్టీ లకి దూరంగా ఉంటాడన్న విషయం తెలుసుకుని తాను ఒక ప్రయత్నం చేసి ప్రభాస్ వద్దనడంతో అతడు లేకుండానే పార్టీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ముంబై లో జరగనున్న ఈ గ్రాండ్ పార్టీ కి బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరు కానున్నారు. రాజమౌళి కూడా తన కుటుంబంతో కలిసి టూర్ వెల్దామనుకున్న నేపథ్యంలో ఈ పార్టీ ఎప్పుడు జరగనుందో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. కానీ, అందరు ఖాళీ అయింతర్వాతే పెట్టుకుందాం అని కరణ్ జోహార్ నిర్ణయించాడట. ఇప్పటికే, 800 కోట్ల పై చిలుకు వసూళ్లు కొల్లగొట్టిన బాహుబలి 2 త్వరలో 1000 కోట్లు సాధించి ఈ మార్క్ దాటిన మొదటి భారతీయ చిత్రం గా నిలవనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



