ఆమిర్ ఖాన్‌కి నిద్ర లేకుండా చేసిన బాహుబలి
on May 6, 2017

ఇండియా లో టాప్ మార్కెట్ ఉన్న హీరోలు ఎవరంటే ఇంతకు ముందు ఠక్కున గుర్తుకొచ్చే పేర్లు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్. కానీ, అదంతా గతం. బాహుబలి 2 విడుదల తర్వాత ఖాన్లకి కంటికి కునుకు లేకుండా పోయింది. ఒక ప్రాంతీయ చిత్రం 1000 కోట్ల మైలురాయికి చేరువలో రావడం ఏంటి అనే విషయం వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇంత వరకు బాహుబలి 2 ప్రభంజనం గురించి నోరు విప్పక పోయినా, ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు రాజమౌళి చిత్రం గురించి తన అభిప్రాయం వెలిబుచ్చాడు. అమీర్ ఖాన్ ఓ సందర్బంగా మాట్లాడుతూ అసలు బాహుబలి లాంటి ప్రాంతీయ సినిమా ఇలాంటి రికార్డులు సృష్టిస్తుందని కల్లో కూడా ఊహించలేదని చెప్పాడు.
"బాలీవుడ్ స్థాయిని మించి ఓ డబ్బింగ్ సినిమా ఇంతటి వసూళ్లను సాధిస్తుంది. నిజంగా ఇది ఇండియన్ సినిమాకే తలమానికం," అంటూ పొగిడేశారు. ఈ నమ్మలేని నిజం తనకు నిద్ర లేకుండా చేసిందని కూడా చెప్పాడట. బాలీవుడ్ లో ఇప్పటి వరకు వసూళ్లలో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో అమీర్ ఖాన్ పీకే ఉంది. బాహుబలి 2 విడుదలయి 8 రోజులు దాటినా, ఇప్పటికీ టిక్కెట్ల కోసం క్యూలు తగ్గలేదు. ఖాన్లకి అందనంత టార్గెట్ ఈ చిత్రం పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మీరూ ఒప్పుకుంటారుగా ఈ వాస్తవం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



