సూపర్ స్టార్ కి నివాళిగా షూటింగ్స్ బంద్
on Nov 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాదు ఆయనకు నివాళిగా రేపు షూటింగ్స్ బంద్ చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నాయి.
కృష్ణ గారికి గౌరవ సూచనగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ బుధవారం(నవంబర్ 16న) మూసివేయడం జరుగుతుంది అని తెలుపుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ నిర్ణయానికి పూర్తి తెలుపుతున్నట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రకటించింది.
ఆనారోగ్యంతో కృష్ణ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్ధం కృష్ణ పార్ధివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



