ఆగస్టు 1 నుంచి తెలంగాణలో కొత్త టికెట్ ధరలు!
on Jul 25, 2022

ఓటీటీలు, అధిక టికెట్ ధరలు కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించారని, అందుకే బాక్సాఫీస్ దగ్గర మెజారిటీ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణలో టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినీ పరిశ్రమ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. తాజాగా 'తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' కొత్త టికెట్ ధరలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదించిన కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో అమలులోకి రానున్నాయట. ఈ కొత్త ధరలలో భాగంగా సినిమాలను స్మాల్, మీడియం, బిగ్ బడ్జెట్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. స్మాల్ బడ్జెట్ సినిమాలకు A,B సెంటర్లలో సింగిల్ స్క్రీన్ లో అధికంగా రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 కాగా, C సెంటర్స్ లో రూ.70, రూ.125 గా ఉండనున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాలకు A,B సెంటర్లలో రూ.112, రూ.177, C సెంటర్స్ లో రూ.100, రూ.177 ఉంటాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు A,B సెంటర్లలో రూ.177, రూ.295, C సెంటర్స్ లో రూ.150, రూ.295 గా ఉండనున్నాయి. అయితే పెద్ద సినిమాలకు అధికంగా రూ.295 ప్రతిపాదించడంపై ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిన్న సినిమాలకు అధికంగా రూ.100, మీడియం రేంజ్ సినిమాలకు అధికంగా రూ.150, పెద్ద సినిమాలకు అధికంగా రూ.200 నిర్ణయిస్తే బాగుంటుందని.. అప్పుడే ప్రేక్షకులు థియేటర్స్ కి రావడంతో పాటు, రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారని అంటున్నారు.

అలాగే ఓటీటీలో సినిమాల విడుదల పైన కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రూ.6 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అవ్వాలని రూల్ పెట్టారట. రూ.6 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు కనీసం పది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని షరతు పెట్టారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



