తేజా.. ఇప్పుడేమంటావ్?
on Sep 12, 2015
.jpg)
తేజది ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనో, తన సినిమాపై అసలే మాత్రం కాన్ఫిడెన్స్ లేకో.. ఓ మాట అనేశాడు. ''నా సినిమా చూసేముందు టాక్ తెలుసుకోండి. నచ్చితే చూడండి. లేదంటే పైరసీ చూసేయండి. ఏం ఫర్వాలేదు..'' అంటూ ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తేజ ఇలా మాట్లాడాడంటే నిజంగానే సినిమాలో ఏదో మేటర్ ఉండే ఉంటుందని అనుకొన్నారంతా. అయితే హోరా హోరీ మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. జయం సినిమానే ఇంకో యాంగిల్‌లో తీసి... బోర్ కొట్టించాడు తేజ.
తొలిసారి తన సినిమాకి `కామెడీ` కోటింగ్ ఇద్దామని ప్రయత్నించి భంగపడ్డాడు. తలాతోకా లేని టేకింగ్‌తో, లాజిక్ లేని సన్నివేశాలతో విసిగించేశాడు. తేజ మారలేదు... అతని కథా మారలేదు అంటూ.. ఈ సినిమా చూసినవాళ్లంతా నొసలు చిట్లించుకొంటున్నారు. తానేదో గొప్ప కళాఖండం తీసినట్టు, మిగిలిన వాళ్లంతా రొటీన్ సినిమాలు తీస్తూ బోర్ కొట్టిస్తున్నారని, ఇండ్రస్ట్రీలో ఉన్నవి రెండే రెండు కథలని సెటైర్లు వేసిన తేజ... తాన దగ్గర కూడా రెండే కథలున్నాయిని, వాటినే తిప్పి తిప్పి తీస్తున్నానని హోరా హోరీతో మరోసారి నిరూపించుకొన్నాడు తేజ.
ఈ సినిమా తొలి షోకే ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. నచ్చకపోతే.. పైరసీ చూడండి అన్న తేజ... ఇప్పుడేమంటాడు. రేపటి నుంచి 'నా సినిమా చూడండి' అంటూ ప్రమోషన్లు ఎలా చేసుకొంటాడు..?! ఇప్పుడు తేజ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



