మనోజ్ కు మోహన్ బాబు సర్ ప్రైజ్ గిఫ్ట్
on Sep 12, 2015
.jpg)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కొడుక్కి ఇచ్చిన పెళ్లి కానుక ఏంటో కూడా కొంచెం లేటుగా బయటపడింది. తన కొడుక్కి రూ.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ డిస్కవరీ న్యూ వెర్షన్ కారును బహుమతిగా ఇచ్చాడు మోహన్ బాబు. టాలీవుడ్ లో ఈ మోడల్ కారును ఇంతవరకూ ఎవ్వరూ వినియోగించలేదు. రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్న మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డితో కలిసి అమెరికా సహా వివిధ దేశాల్లో విహరించి ఈ మధ్యే హైదరాబాద్ కు వచ్చాడు. మనోజ్ ఇండియాకు రాగానే సర్ ప్రైజ్ గా ఈ బహుబతిని అందజేయాలని భావించారు మోహన్ బాబు కానీ కొత్త వెర్షన్ కావడం వల్ల డెలివరీ ఆలస్యమైంది. ఇంతలోనే తండ్రి తనకివ్వబోతున్న బహుమతి గురించి మనోజ్ కు తెలిసిపోయింది. ఈ వార్త అటు ఇటు పాకి మీడియా వాళ్ల చెవిలోనూ పడింది. మొత్తం టాలీవుడ్ లో ఇప్పుడీ కారు సంగతి పెద్ద విశేషంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



