బాలీవుడ్‌లో తమన్నా తొలి వెబ్‌సిరీస్!
on Aug 6, 2021

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. హిందీ చిత్రాలలోనూ నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. ఇప్పటికే 'నవంబర్ స్టోరీ', 'లెవెన్త్ అవర్' వంటి వెబ్ సీరీస్ లలో నటించిన తమన్నా తాజాగా హిందీలో ఓ వెబ్ సీరీస్ చేయడానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది.
బాలీవుడ్‌లో తన తొలి వెబ్ సిరీస్ చేసేందుకు తమన్నా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ ఈ వెబ్ సీరీస్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తమన్నాతో పాటు ఆశిమ్ గులాటి ఇందులో లీడ్ రోల్ చేయనున్నారని.. అరునిమ శర్మ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు.
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్ 'మాస్ట్రో', గోపీ చంద్ 'సీటీమార్' చిత్రాల్లో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



