'పుష్ప' సెట్స్ నుంచి అనసూయ ఫోటో లీక్!
on Aug 5, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుల్లితెర బ్యూటీ అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీలో అనసూయ లుక్ కి సంబంధించిన ఫోటో లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' మూవీలో అనసూయ రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో సుకుమార్ పుష్పలో అనసూయను ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇందులో ఆమె సునీల్‌కి భార్యగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ లుక్ కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫొటోలో అనసూయ షార్ట్ హెయిర్‌తో, నుదుటన పెద్ద బొట్టుతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ ఫోటోలో ఉన్నది అనసూయనేనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పుష్పలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మక మందన్నా నటిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



