సూర్యకి షాకిచ్చిన కోర్టు.. 'ఆకాశం నీ హద్దురా' హిందీ రీమేక్ పై స్టే!
on Aug 6, 2021

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సురారై పొట్రు' గత ఏడాది విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులో విడుదల కాగా ఇక్కడ కూడా విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు రీమేక్ సన్నాహాలు జరుగుతుండగా మరోవైపు కోర్టు ఈ రీమేక్ పై స్టే విధించి షాక్ ఇచ్చింది.
బాలీవుడ్ లో అబుండంటియా ఎంటర్టైన్మెంట్స్ కలిసి సూర్య ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాడు. అయితే సూర్య కి చెందిన 2D ఎంటర్టైన్మెంట్ పై మద్రాస్ హైకోర్టులో ఒక కేసు దాఖలైంది. సూర్యతో పాటు ఒరిజినల్ తమిళ వెర్షన్ ని నిర్మించిన శిఖ్యా ఎంటర్టైన్మెంట్ ఈ ఫిర్యాదు చేసింది. శిఖ్యా సంస్థతో 2D ఎంటర్టైన్మెంట్ ఒప్పందంలో హిందీ రీమేక్ కూడా ఉంది. కానీ సూర్య 2D సంస్థ ఆ ఒప్పందాన్ని మీరడంతో.. శిఖ్యా సంస్థ ఆశ్రయించింది. తమ సమ్మతి లేకుండా అబుండంటియాతో సూర్య చేతులు కలిపాడని, అది ఒప్పందాన్ని మీరడమేనని శిఖ్యా సంస్థ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు స్టే విధించిందని తెలుస్తోంది.
ప్రస్తుతం సురారై పొట్రు హిందీ రీమేక్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది. నటీనటులను ఫైనల్ చేసే పనిలో మూవీ టీమ్ ఉంది. కానీ ఇంతలోనే కోర్టు స్టే ఇచ్చింది. మరి ఈ వివాదాన్ని సూర్య ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



